నక్సల్స్ దాడిని ఖండించిన ప్రధాని

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 11:12 AM IST
నక్సల్స్ దాడిని ఖండించిన ప్రధాని

Updated On : May 28, 2020 / 3:41 PM IST

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్‌ చేస్తున్నాను..వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదు అని మోదీ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. పోలీసు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని మోదీ స్పష్టం చేశారు.

పోలీసుల వాహనంపై మావోయిస్టులు దాడి చేయడాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో మాట్లాడానని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.
Also Read : మావోల దాడి : 15 మంది జవాన్ల మృతి