NITI Aayog: కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు: నీతి ఆయోగ్ లో ప్రధాని మోదీ

నీతి ఆయోగ్.. అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్‌. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.

NITI Aayog: కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు: నీతి ఆయోగ్ లో ప్రధాని మోదీ

Updated On : May 24, 2025 / 5:07 PM IST

NITI Aayog: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు టీం ఇండియాలా కలిసి పని చేస్తే సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ ఉండదని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

‘అభివృద్ధిలో వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్రం, అన్ని రాష్ట్రాలు టీమ్ ఇండియాలా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదు. పాలక మండలి సమావేశం థీమ్ ‘వికసిత్ భారత్ కోసం వికసిత్ రాజ్యం@2047’. “వికసిత్ భారత్ అనేది ప్రతి భారతీయుడి లక్ష్యం. ప్రతి రాష్ట్రం వికసిత్ అయినప్పుడు, భారతదేశం వికసిత్ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Also Read: దేశంలో కరోనా కలకలం.. కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో హైఅలర్ట్..

నీతి ఆయోగ్.. అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్‌. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశ ప్రధాని నీతి ఆయోగ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి.

సాధారణంగా, పూర్తి కౌన్సిల్ సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గతేడాది జూలై 27న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. కౌన్సిల్ మొదటి సమావేశం ఫిబ్రవరి 8, 2015న జరిగింది.