రైతులకు పెన్షన్ : కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ప్రారంభించిన మోడీ

రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు రైతులు ఈ స్కీమ్ కింద రిజిస్టర్ అయితే..వారు 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు 3 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.
ఈ పధకం జార్ఖండ్‌ను భారత్ తో పాటు ప్రపంచానికి అనుసంధానం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. రానున్న మూడేళ్లకు రూ 10,774 కోట్లను ప్రధానమంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన పధకానికి కేటాయించారు. ఇదే కాక రాంచీలో మల్టీ మోడల్ టెర్మినల్ ను మోడీ ప్రారంభించారు. అదే విధంగా ‘ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మంథన్ యోజన’, ‘స్వరోజ్ గార్’ పెన్షన్ పథకాలనూ మోడీ ప్రారంభించారు. ప్రధాన మంత్రి కిసాన్ మంథన్ యోజన కింద 1,16,183 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ తెలిపారు.