సరిహద్దుల్లోని సైనికులతో మోడీ దీపావళి

PM Modi likely to celebrate Diwali with Army jawans at border areas ప్రతిఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దిపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందుకు నరేంద్రమోడీ రేపు(నవంబర్-13,2020) సరిహద్దుల్లోని ఓ పోస్ట్ దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రతిఏటా దీపావళి రోజున భారత్- చైనా మరియు భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో జవాన్లతో కలిసి దీపావళి సంబరాల్లో ప్రధాని పాల్గొన్న విషయం తెలిసిందే. గతేడాది జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఎల్ వోసీ వద్ద విధులు నిర్వహిస్తన్న భద్రతాదళాలతో మోడీ దీపావళి జరుపుకున్నారు.
2018లో ఉత్తరాఖండ్ లోని బోర్డర్ పొజిషన్ వద్ద దీపావళిని జవాన్లతో సెలబ్రేట్ చేసుకున్నారు మోడీ. 2017లో నార్త్ కశ్మీర్ లోని గురేజ్ సెక్టార్ లో దీపావళి వేడుకలు జవాన్లతో కలిసి జరుపుకున్నారు. 2015లో పంజాబ్ బోర్డర్ లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు మోడీ. భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 2014లో..సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.