వ్యాపార దిగ్గజాలతో మోడీ భేటీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 6, 2020 / 02:00 PM IST
వ్యాపార దిగ్గజాలతో మోడీ భేటీ

Updated On : January 6, 2020 / 2:00 PM IST

ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజ నాయకులతో ప్రధానమంత్రి మోడీ ఇవాళ(జనవరి-6,2020)సమావేశమయ్యారు. ఆర్థిక వృద్ధి మెరుగుదలకు అనుసరించాల్సిన మార్గాలు, ఉద్యోగాల కల్పన వంటి ముఖ్య అంశాలను వారితో మోడీ చర్చించారు. మోడీని కలిసిన వారిలో…టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా,రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా,ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ, భారతీ ఎంటర్ప్రైసెస్ చైర్మన్ సునీల్ మిట్టల్,వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్,టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్,టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్,ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎమ్ నాయక్,తదితరులు ఉన్నారు.

త్రైమాసికం తర్వాత త్రైమాసికం అంటూ జీడీపీ (స్థూల జాతీయో ఉత్పత్తి) జులై-సెప్టెంబర్ క్వార్టర్ లో 4.5శాతం వృద్ధితో ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. అంతేకాక, చాలా స్థూల సూచికలు వృద్ధి క్షీణతలను కొనసాగే అవకాశముందని సూచిస్తున్నాయి. క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం రూ. 102 లక్షల కోట్లు ఖర్చుచేయనుంది .పునరుద్ధరణీయ ఇంధనాలు, రైల్వేలు, పట్టణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, డిజిటల్ సెక్టర్ తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.