దేశభక్తిని బలోపేతం చేయాలి : అయోధ్య తీర్పుపై ప్రధాని

  • Published By: chvmurthy ,Published On : November 9, 2019 / 07:53 AM IST
దేశభక్తిని బలోపేతం చేయాలి : అయోధ్య తీర్పుపై ప్రధాని

Updated On : November 9, 2019 / 7:53 AM IST

వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు.  సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.  రామభక్తి, రహీం భక్తి కాదని,  భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్ని సమయం ఇదని ఆయన ట్విట్టర్ లో పేర్కోన్నారు.  దేశ ప్రజలందరూ శాంతి, సద్భావనా, ఐకమత్యంతో నిలవానలి విజ్ఞప్తి చేస్తున్నా అని మోడీ  అన్నారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక విషయాన్ని న్యాయస్థానం స్నేహపూర్వకంగా ముగించిందన్నారు. ప్రతి వైపు,ప్రతి దృక్కోణానికి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి తగిన సమయం, అవకాశం ఇవ్వబడిందని,ఈ తీర్పు న్యాయ ప్రక్రియలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని మోడీ తెలిపారు.