మోడీ కేరాఫ్ సింప్లిసిటీ… సోఫా వద్దని కుర్చీలో

ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ కార్యక్రమంలో మోడీ ప్రవర్తించిన విధానం చూసి.. ‘మోడీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవు.. తెలివితేటలు, వినయ విధేయతలతో పాటు ఒదిగి ఉండే వ్యక్తి మనకు ప్రధానిగా వచ్చాడు’ అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
గురువారం రష్యా ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్ కార్యక్రమంలో మోడీ తన కోసం ప్రత్యేకంగా వేసిన సోఫాలో కూర్చోకుండా.. దాన్ని తీసి మిగతా వారిలాగానే తనకు కూడా కుర్చీనే వేయాలంటూ కోరారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు ఆ సోఫా తొలగించి కుర్చీ తెప్పించి వేశారు. అందరితో పాటు సాధారణ వ్యక్తిలా కుర్చీలో కూర్చుని ప్రధాని ఫోటో దిగారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM @NarendraModi जी की सरलता का उदाहरण आज पुनः देखने को मिला, उन्होंने रूस में अपने लिए की गई विशेष व्यवस्था को हटवा कर अन्य लोगों के साथ सामान्य कुर्सी पर बैठने की इच्छा जाहिर की। pic.twitter.com/6Rn7eHid6N
— Piyush Goyal (@PiyushGoyal) September 5, 2019