హ్యాపీ టీచర్స్ డే : ప్రధాని మోడీ శుభాకాంక్షలు

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 03:55 AM IST
హ్యాపీ టీచర్స్ డే : ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Updated On : September 5, 2019 / 3:55 AM IST

టీచర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశంలోని టీచ‌ర్లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని టీచర్లకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను తన ట్విట్ట‌ర్ లో  పోస్టు చేశారు. సెప్టెంబర్ 5 డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి. ఈ రోజునే భారతదేశమంతా ఉపాధ్యాయుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ‌న్‌కు ప్రధాని మోడీ నివాళి అర్పించారు.

అనంతరం టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణ‌న్ అత్యుత్త‌మ ఉపాధ్యాయుడ‌ని ఆయన కీర్తించారు. ఆయన మంచి మార్గ‌ద‌ర్శ‌కుడని త‌న ట్వీట్‌లో మోడీ తెలిపారు. టీచ‌ర్ల‌కు వ‌య‌సుతో సంబంధంలేద‌ని, రిటైర్మెంట్ ఉండ‌ద‌ని ప్ర‌ధాని త‌న వీడియోలో తెలిపారు. ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించినా.. రాధాకృష్ణ‌న్ మాత్రం ఓ శిక్ష‌కుడిగానే ఉన్నార‌న్నారనీ..బోధ‌ించే త‌త్వాన్ని ఎప్పటికీ  మ‌ర‌వ‌నివారే మంచి టీచ‌ర్లు అవుతార‌న్నారు. అటువంటివారు మంచి విద్యార్థుల‌ను త‌యారు చేస్తార‌న్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా టీచ‌ర్లంద‌రికీ గ్రీటింగ్స్ తెలిపారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలామందికి  రాష్ట్రపతిగా..ఉపరాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఉపాధ్యాయుడుకూడా. ప్రముఖ విద్యావేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1882 సెప్టెంబర్ 5న జన్మించారు. స్వాతంత్ర్యం అనంతరం తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. పదేళ్లు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన అనంతరం రాష్ట్రపతి పదవి వరించింది. ఓ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవడం ఆ వృత్తికే గర్వకారణం. అందుకే 1962 నుంచి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం.