PM Modi : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

PM Modi : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat Trains

PM Modi – Vande Bharat Train : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఒకే సారి 9 వందే భారత్ రైళ్లను ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కొత్త రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్ -బెంగళూరు, విజయవా-చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

దీంతో రానున్న రోజుల్లో మరిన్ని స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీసులను విస్తరించాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందులో భాగం ఇవాళ మరో 9 కొత్త వందే భారత్ రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సారి అధిక ప్రాధాన్యం లభించింది.

Vande Bharat Express: విద్యార్థులకు ఉచితంగా వందే భారత్ రైలు ప్రయాణం.. ఎప్పుడు, ఎక్కడ?

ఇప్పటివరకు బ్లూ కలర్ లో వందే భారత్ రైళ్లు పట్టాలపైకి రాగా, ఈ సారి వచ్చేవి ఆరెంజ్ కలర్ లో ఉండనున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ యశ్వంత్ పూర్, విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపీ వర్చువల్ గా ప్రారంభించారు. కాచిగూడ వేదికగా జరిగిన ప్రారంభవోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ – బెంగళూరు మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మహబూగ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పుర్ చేరుకుంటుంది. తిరిగి 2.40గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బుధవారం మినహా ఇది ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.