Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేర ప్రధాని బుధవారం అందరికంటే ముందు ట్వీట్ చేశారు....

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Modi's birthday wishes for Kejriwal

Delhi chief minister Arvind Kejriwal : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేర ప్రధాని బుధవారం అందరికంటే ముందు ట్వీట్ చేశారు. (PM Modi’s birthday wishes for Kejriwal) ఢిల్లీ సర్కారుకు, కేంద్రానికి మధ్య గొడవలు జరుగుతున్నా, కేజ్రీవాల్ కు మోదీ మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Seema Haider : సచిన్‌ను ‘లప్పు సా’ అన్నందుకు సీమా హైదర్ హెచ్చరిక

ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలో ఢిల్లీలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ పుట్టిన రోజే ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) చట్టం, 2023కి పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రంతో కేజ్రీవాల్ విభేదాలు తీవ్రమయ్యాయి.

Rudraprayag Bridge collapse : భారీవర్షాలు.. కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన

ఈ చట్టం దేశ రాజధానిలో బ్యూరోక్రసీపై నియంత్రణ సాధించేందుకు కేంద్రానికి అధికారం ఇస్తుంది. కేంద్రం ఢిల్లీ ప్రజల హక్కులను హరిస్తుందని మంగళవారం స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ చట్టం ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్‌లతో సహా గ్రూప్ ఏ సేవలను నియంత్రిస్తారు.