OLXలో మోదీ ఆఫీస్ సేల్, నలుగురు అరెస్టు

OLXలో మోదీ ఆఫీస్ సేల్, నలుగురు అరెస్టు

Updated On : December 18, 2020 / 2:48 PM IST

PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్ సైట్. ప్రధాని కార్యాలయానికి సంబంధించిన వివరాలు, ఫొటోలతో OLX వెబ్ సైట్‌లో కొందరు వ్యక్తులు పోస్టు చేయడం కలకలం రేపింది. ఒక్కసారిగా అలర్ట్ అయిన..పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు.

ప్రధాని మోదీ వారణాసి (Varanasi) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ ప్రధానికి పార్లమెంటరీ కార్యాలయం ఉందనే సంగతి తెలిసిందే. దీనిని విల్లాగా పేర్కొన్న వారు..6500 చదరపు గజాల్లో ఈ బిల్డింగ్ ఉందని OLX వెబ్ సైట్‌లో పొందుపరిచారు. నాలుగు గదులు, నాలుగు బాత్ రూంలు ఉన్నాయన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను అందులో పోస్టు చేశారు. లక్ష్మీకాంత్ ఓఝా (Lakshmikant Ojha) పేరిట ఈ ప్రకటన పోస్టు అయ్యింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ పోస్టును తొలగించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.