Narendra Modi : స్థిరమైన ప్రభుత్వంతోనే దేశ ప్రగతి సాధ్యం, మా లక్ష్యం అధికారం కాదు- NDAకు కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని మోదీ
మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది. (Narendra Modi)

Narendra Modi
Narendra Modi – NDA : స్థిరమైన ప్రభుత్వం ఒక్కటే దేశ ప్రగతిని మార్చగలదు అని ప్రధాని మోదీ అన్నారు. స్థిర ప్రభుత్వం వల్లే ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని చెప్పారు. ఎన్డీయే ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేసిందని ప్రధాని తెలిపారు. ఎన్డీయే పక్ష నేతల మెగా భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశామన్నారు ప్రధాని మోదీ. 1998లో ఎన్డీఏ ఏర్పాటు జరిగిందన్న ప్రధాని మోదీ.. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీయే ఏర్పాటు కాలేదన్నారు.
”1990లో దేశంలో అస్థిరత దిశగా కూటమి ఏర్పాటు జరిగింది. కాంగ్రెస్.. ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలు కూల్చింది. 1998లో ఎన్డీఏ ఏర్పాటు జరిగింది. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. ఎన్డీఏ ఏర్పాటులో వాజ్‌పేయీ, అడ్వాణీ కీలక భూమిక పోషించారు. మరో ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్డీఏ ఏర్పాటు కాలేదు.(Narendra Modi)
దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఎన్డీఏ(NDA) కూటమి ఏర్పాటైంది. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే దేశ ప్రగతి మార్చగలదు. స్థిర ప్రభుత్వం వల్లే ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగింది. ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశాం. మిత్రపక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయి. ఎన్డీఏ ఏర్పాటై 25ఏళ్లు పూర్తైంది. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించింది. ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది.
Also Read..NDA Vs INDIA: పోటాపోటీగా కూటములు.. ఇంతకీ ఎన్నికల పోటీలో ఎవరి బలం ఎంత?
రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభివృద్ధి సాధ్యం. ఈ నినాదంతోనే ఎన్డీఏ నిరంతరం ముందుకు సాగింది. ఎన్డీఏతో కలిసి వచ్చిన ప్రతి పార్టీకి అభినందనలు. భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నా. వచ్చే 25ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన. ఆత్మనిర్భర్, భారత్ పురోభివృద్ధి లక్ష్య సాకారానికి కృషి. భారతీయులు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. కొత్త సంకల్పం సాకారానికి ఎన్డీఏ కీలక భూమిక పోషిస్తుంది. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది. అందరి కృషి వల్లే దేశం అభివృద్ధి పథంలో సాగుతోంది. దేశ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. దేశ ప్రజలందరి భావనలను ఎన్డీఏ ముందుకు తీసుకెళ్తుంది” అని ప్రధాని మోడీ అన్నారు.
ఇక, ఎన్‌డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చారు ప్రధాని మోదీ. ఎన్-న్యూ ఇండియా, డీ-డెవలప్ నేషన్, ఏ-యాస్పిరేషన్ ఆఫ్ పీపుల్ అని నిర్వచించారు.
Also Read..INDIA: అందుకే మా కూటమికి ఇండియా అని పేరు పెట్టాం: రాహుల్, మమత