Narendra Modi : చైనా గడ్డపై నిలబడి చైనాకే షాక్ ఇచ్చిన మోదీ.. ఒక్క మాటతో…
చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) డ్రాగన్ కంట్రీకే షాక్ ఇచ్చారు. షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు మీద కౌంటర్ వేశారు.

Narendra Modi
Narendra Modi : చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రాగన్ కంట్రీకే షాక్ ఇచ్చారు. షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు మీద కౌంటర్ వేశారు. చైనా చేపట్టే ప్రాజెక్టు ఏ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉండరాదన్నారు. దేశాల మధ్య నమ్మకాన్ని పెంచేదిలా ఉండాలన్నారు.
Also Read: చైనా పర్యటనలో మోదీకి హోంగ్‌చీ కారు ఇచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
దేశాల మధ్య వాణిజ్యం, పోర్టుల నుంచి దేశంలోని ఇతర రూట్లకు రవాణా సులభతరం చేసేందుకు చైనా బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఇది గ్లోబర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలను కలుపుతూ ఓ భారీ ప్రాజెక్టును చైనా చేపట్టింది. ఇందులో భారీ ఎత్తున కారిడార్లను నిర్మించాలని ప్లాన్ చేసింది. అందులో భారత్ ఆక్రమిత కాశ్మీర్ లో లో చైనా చేపట్టిన చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద భారత్ అభ్యంతరం చెబుతోంది.
అది పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగమని. .దాన్ని పాకిస్తాన్ కి చెందిన భూమిగా అంగీకరించబోమని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. వివాదాస్పద భూమిలో చైనా చేపట్టిన కారిడార్, అందుకు పాకిస్తాన్ మద్దతు తీసుకోవడం మీద మోదీ స్పందించారు. అది భారత్ భూభాగం కాబట్టి.. అలాంటి భూమిలో పాకిస్తాన్ మద్దతుతో కారిడార్ ఎలా చేపడతారని పరోక్షంగా నిలదీశారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
పాకిస్తాన్ పై ఎటాక్..
ఇదే వేదికపై పాకిస్తాన్ మీద ప్రధాని ఎటాక్ చేశారు. కొన్ని దేశాలు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాయని.. దీని వల్ల దేశాల భద్రతకే ముప్పు కాదని… మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఎటాక్ గురించి ప్రధాని పరోక్షంగా ఈ కామెంట్స్ ఛేశారు. గత నాలుగు దశాబ్దాల నుంచి టెర్రరిజం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ‘40 ఏళ్లుగా టెర్రరిజం వల్ల మేం ఎంతో బాధపడుతున్నాం. ఈ మధ్యజరిగిన పహల్గాం ఎటాక్ అనేది టెర్రరిజానికి వరస్ట్ సైడ్. ఇలాంటి క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని ప్రధాని మోదీ అన్నారు.