Mehbooba Mufti : పాకిస్తాన్ తో కూడా మోదీ మాట్లాడాలి
కశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ తో కూడా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడాలని పీడీపీ(Peoples Democratic Party)అధినేత్రి మొహబూబా ముఫ్తీ అన్నారు.

Mufti
Mehbooba Mufti కశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ తో కూడా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడాలని పీడీపీ(Peoples Democratic Party)అధినేత్రి మొహబూబా ముఫ్తీ అన్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీతో కశ్మీర్ నేతల భేటీ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలపై ఇవాళ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో గుప్కర్(కశ్మీర్ ప్రాంతీయ పార్టీల రాజకీయ కూటమి)నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన అనంతరం ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ…దోహా వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపగలిగినప్పుడు.. ఓ తీర్మాణం కోసం తమతో మరియు పాకిస్తాన్ తో కూడా మోదీ చర్చలు జరపాలన్నారు. ప్రధానితో భేటీ సమయంలో కశ్మీర్ కి సంబంధించిన తమ ఆలోచనలు ప్రస్తావిస్తామని,జమ్మూకశ్మీర్ కి రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తామని ముఫ్తీ అన్నారు. ఆర్టికల్ 370ని ఉదహరిస్తూ..తమ నుంచి తీసుకున్నదాని గురించి మాట్లాడేందుకే గుప్కర్ కూటమి కలిసికట్టుగా ముందుకొచ్చిందని ముఫ్తీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగవిరుద్ధం,అక్రమమని ముఫ్తీ తెలిపారు.
కాగా, ప్రధానితో భేటీకి కశ్మీర్ మాజీ సీఎంలతో సహా 14మంది నేతలు ఆహ్వానించబడిన విషయం తెలిసిందే. గురువారం ప్రధాని అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తనతో పాటు మెహబూబా ముఫ్తీ,మొహమ్మద్ తారిగమి సాహిబ్ హాజరవుతారని గుప్కర్ కూటమి చైర్ పర్సన్ ఫరూక్ అబ్దుల్లా మంగళవారం తెలిపారు.