పోలీస్ అధికారుల బదిలీలు: ఈసీని కలవనున్న టీడీపీ నేతలు

అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదు చేశారనే కారణంతో హఠాత్తుగా పోలీస్ అధికారులను బదిలీ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. ఈసీ నిర్ణయం విస్మయం కలిగించిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరు ఎన్నికల బాధ్యలకు దూరంగా ఉంచాలని ఆదేసించింది. ఈసీ తీరుతో అధికార తెలుగుదేశం పార్టీ మండి పడుతోంది. వైసీపీ, బీజేపీ కుట్రలో భాగంగానే పోలీసు ఉన్నధికారులు బదిలీలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.బదిలీల క్రమంలో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. రానున్న రోజుల్లో మరికొందరు అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉందని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈక్రమంలో చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. మరోపక్క టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.
Read Also : చంద్రబాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్