Police Save Women: బంగ్లా టూ బెంగుళూరు.. ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి..

Police Save Women: బంగ్లా టూ బెంగుళూరు.. ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి..

Police Save Women

Updated On : April 20, 2021 / 12:37 PM IST

Police Save Women: ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ నుంచి మహిళలను బెంగళూరు తీసుకొచ్చారు. నమ్మి వచ్చినవారికి ఉద్యోగం చూపించకుండా భయపెట్టి పడుపువృత్తిలోకి దించి హింసించారు. ఈ ఘటన బెంగళూర్‌లోని మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్‌లో వెలుగుచూసింది. ఓ ప్లాట్ రెంటుకు తీసుకోని మహిళలతో బలవంతంగా వేశ్యవృత్తి చేయిస్తున్నారు.

ప్రతి రోజూ చాలామంది వచ్చి వెళ్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఉంటున్న ఫ్లాట్‌పై రైడ్ చేసిన సీసీబీ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు కాగా మిగతా ముగ్గురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వైశ్యావాటిక నిర్వాహకులు. నౌషద్‌అలీ, స్వరూప్, సమీర్‌ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి 11 నకిలీ పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు బంగ్లాదేశ్‌ మహిళలను కాపాడారు. మహిళలకు బెంగళూరులో మంచి ఉపాధిని చూపిస్తామని ఇక్కడకు తీసుకొచ్చి బలవంతంగా వేశ్యావృత్తి చేయించేవారని వారు పోలీసులకు తెలిపారు.