పోలీసు థర్డ్ డిగ్రీ : యువకుడిని తాళ్లతో కట్టేసి కర్రలతో చావబాదారు
కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు.

కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు.
కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు అతను హాహాకారాలు చేశాడు. అరుపులు, కేకలు వేశాడు. కొట్టొద్దని ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఓ యువకుడికి థర్డ్ డిగ్రీ పనిష్‌మెంట్ ఇస్తున్న వీడియో బయటకు లీక్ అయింది. ఎస్ఐ శ్రీకాంతె గౌడ ఓ యువకుడిని హాకీ స్టిక్‌తో విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. యువకుడిని తాళ్లతో కట్టేసి హాకీ స్టిక్ విరిగేదాకా పాదాలపై విపరీతంగా కొట్టారు.
నొప్పిని భరించలేక యువకుడు హాహాకారాలు చేశాడు. దొంగతనం కేసులో ఆ యువకుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. థర్డ్ డిగ్రీ వీడియో బయటకు లీక్ అవడంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు శ్రీకాంతె గౌడను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Also Read : తమ్ముళ్ల తగాదా : టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కొట్టుకున్న కార్యకర్తలు