ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు 

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 03:49 AM IST
ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు 

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపుర్‌ గవర్నర్‌ నజ్మా హెపుల్లా ఇంపాల్‌లో తన ఓటు హక్కునువినియోగించుకున్నారు. బెంగళూరు పోలింగ్ కేంద్రంలోని జయనగర్ లోని 54వ పోలింగ్ కేంద్రంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటు వేశారు. ..ప్రముఖ నటుడు..ఇండిపెండెంట్ అభ్యర్థి  ప్రకాశ్ రాజ్ బెంగళూరులో ఓటు వేశారు. 

మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ తో పాటు ఆయన కుమార్తె శృతి హాసన్ లు చెన్నైలోని ఆల్వర్ పేటలోని 27వ పోలింగ్ కేంద్రంలోను..తమిళనాడు సీఎం పళనిస్వామి ఇడప్పడి పోలింగ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే మరోవైపు కాంగ్రెస్‌ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కు వాడుకోగా.. కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవగా ప్రముఖ రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.