డీప్ కోమాలోకి ప్రణబ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2020 / 02:51 PM IST
డీప్ కోమాలోకి ప్రణబ్

Updated On : August 26, 2020 / 3:25 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.



ఆగస్టు 10న ప్రణబ్‌కు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
https://10tv.in/vaishno-devi-yatras-online-registration-helicopter-booking/
అయితే, ఇప్పుడు ఆయన తీవ్ర (డీప్‌)కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ మద్దతుతో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటెన్‌లో తెలిపింది.



ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండడం వల్ల ప్రణబ్‌కు ట్రీట్మెంట్ అందజేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.