కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగం

నూతన పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు.

కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగం

President Droupadi Murmu enlists the achievements of the government

Updated On : January 31, 2024 / 4:07 PM IST

President Droupadi Murmu: పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ మూర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని పేర్కొన్నారు. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.

రాష్ట్రపతికి ఘన స్వాగతం
అంతకుముందు సెంఘోల్ తో పాటు నూతన పార్లమెంట్ భవనంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఎంపీలు కరతాళ ధ్వనులతో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నంతసేపు ప్రధాని నరేంద్ర మోదీతో సహా అధికారపక్ష సభ్యులు అందరూ బల్లలు చరుస్తూ హర్షద్వానాలు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది
భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం
ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం

చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు
ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ దిగ్విజయంగా ప్రయోగించింది
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది
జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది

ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారిగా 107 పతకాలు సాధించింది
ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించింది
భారత్‌లో తొలిసారిగా నమోభారత్‌ రైలును ఆవిష్కరించాం

నారీశక్తి వందన్‌ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది
తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం
ఎన్నో ఏళ్ల భారతీయుల కల రామమందిర నిర్మాణం సాకారమైంది

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది
దేశంలో కొత్త క్రిమినల్‌ చట్టాన్ని తీసుకొచ్చాం
ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌తో ముందుకెళ్తున్నాం
రక్షణరంగం, అంతరిక్ష రంగంలో నూతన ఆవిష్కరణలు జరిగాయి

రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నాం
ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయి
కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందించాం
ఆత్మనిర్భర భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలుగా మారాయి
రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం
సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం