వాక్కు చెబుతూ ఆలయం ఎదుటే ప్రాణాలు విడిచిన పూజారి..!

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 07:32 AM IST
వాక్కు చెబుతూ ఆలయం ఎదుటే ప్రాణాలు విడిచిన పూజారి..!

Updated On : March 9, 2019 / 7:32 AM IST

కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరు గ్రామం సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. ఆ గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ఆలయం ఎదుట 20 అడుగుల ఎత్తున్న కర్రపైకి ఎక్కిన పూజారి వాక్కు చెబుతూ.. విన్యాసాలు చేస్తుండగా ప్రమాదావశాత్తు కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శుక్రవారం(మార్చ్ 8,2019) రాత్రి ఈ ఘటన జరిగింది. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.