Punjab Election 2022 : మరో రెండు రోజుల్లో ఎన్నికలు, సిక్కు ప్రముఖులతో మోదీ

మోదీతో భేటి కావడంపై సిక్కు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని, ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తిగా...

Punjab Election 2022 : మరో రెండు రోజుల్లో ఎన్నికలు, సిక్కు ప్రముఖులతో మోదీ

Punjab Election

Updated On : February 18, 2022 / 6:13 PM IST

Narendra Modi And Sikhs: మరో రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ సిక్కు సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల మోదీ అధికారిక నివాసంలో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ సిక్కు సంప్రదాయబద్ధమైన స్కార్ఫ్‌ను తలకు చుట్టారు. దానిపై సిక్కుల చిహ్నాన్ని ముద్రించారు. ప్రధాని మోదీని కండువాతో సత్కరించారు సిక్కు ప్రముఖులు. సిక్కుల సంప్రదాయ కత్తిని కూడా మోదీకి ప్రదానం చేశారు.

Read More : 5 States Elections : మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్

మోదీతో భేటి కావడంపై సిక్కు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని, ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. కర్తార్‌పుర్‌ కారిడార్‌ను మళ్లీ తెరిపించడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. దీంతో సిక్కులకు ఎంతో మేలు జరిగిందన్నారు సిక్కు ప్రముఖులు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం చివరిరోజు. ప్రధాని మోదీ పంజాబ్‌లో మూడు ఎన్నికల సభలలో పాల్గొన్నారు.

Read More : West Bengal : దుర్గాదేవిగా మమతా బెనర్జీ..మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. పోస్టర్ దుమారం

ప్రచారంలో కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలను టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి జిరాక్స్‌ కాపీగా ఆప్‌ను పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ పరిస్థితులలో సిక్కులతో భేటి బీజేపీకి ఎంతవరకు కలిసివస్తుందన్నది వేచి చూడాలి.