Union Budget 2023: కీలక మీటింగ్.. 13న ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం..

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Union Budget 2023: కీలక మీటింగ్.. 13న ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం..

Union Budget 2023

Updated On : January 10, 2023 / 11:31 AM IST

Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో అన్నిరంగాల ప్రజలకు మేలుజరిగేలా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొద్దిరోజుల్లో పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు.

PM MODI..Vande Bharat Express : వందే భారత్‌ రైలు ప్రారంభించటానికి హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

వచ్చే శుక్రవారం ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ బృందం, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలో పీఎం నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థ‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. భారత జీడీపీని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో మోదీ ఆర్థికవేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PM Modi: బ్రెజిల్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు.. భారత ప్రధాని మోదీ స్పందన

ప్రస్తుత సంవత్సరంలో భారతదేశ జీడీపీ 7శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతానికి పెరుగుతుందని గతేడాది ప్రభుత్వం అంచనా వేయగా, దానిని ఆర్‌బీఐ 6.8శాతానికి తగ్గించింది. వాస్తవానికి జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం జీడీపీ వృద్ధి 6.3 శాతం వద్ద సౌదీ అరేబియా 8.7 శాతం వృద్ధి రేటు కంటే తక్కువగా ఉంది. మరోవైపు.. 2024 సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.