Priyanka Gandhi: ఎన్నికల ప్రామిస్.. రూ.10లక్షల వరకూ ఫ్రీ ట్రీట్మెంట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్గానాల పర్వం మొదలైపోయింది. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తమ పార్టీ తరపున ఉచిత వైద్యం అందిస్తామంటూ హామీ ఇచ్చారు.

New Project(4)
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్గానాల పర్వం మొదలైపోయింది. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తమ పార్టీ తరపున ఉచిత వైద్యం అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఫ్రీ ట్రీట్మెంట్ తో పాటు, హెల్త్ కేర్ ఫెసిలిటీ కూడా అందిస్తామని.. రూ.10లక్షల వరకూ ఎంత ఖర్చు అయినా తామే భరిస్తామంటూ ప్రకటించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆమె.. ‘కొవిడ్ మహమ్మారి సమయంలో ఆరోగ్య పరిస్థితులు ఎంత దారుణమైపోయాయో చూశాం. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అలా జరిగింది. యూపీ కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ అంతా కలిసి ఇది నిర్ణయించాం. ఎలాంటి జబ్బుకైనా ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలనుకుంటున్నాం. రూ.10లక్షల వరకూ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు.
అంతకంటే ముందు ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ జెండా ఊపుతూ ఉత్తరప్రదేశ్ గురించి ఏడు వాగ్దానాలు చేశారు. రైతులకు రుణ మాఫీ, ఉద్యోగాల కల్పన కల్పించడం వంటి పనులను రాబోయే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే చేస్తామని హామీ ఇచ్చారు.
…………………………………………..: మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథకు ఎమోషన్ తోడైతే రొమాంటిక్!
గోధుమలు, ధాన్యాలను క్వింటాల్ రూ.2వేల 500కే కొనుగోలు చేయొచ్చని, చెఱకు మాత్రం క్వింటాల్ రూ.400కే కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. దాంతో పాటుగా కరెంట్ బిల్ మొత్తంలో సగం మాత్రం చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. తమ పార్టీ మహిళల కోసం ప్రత్యేకమైన మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తుందని, కాంగ్రెస్ లో మహిళలకు 40శాతం టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.
గ్రాడ్యుయేటెడ్ గర్ల్స్ కు స్కూటీలు, 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు వంటివి ఇస్తామని ముందే చెప్పారు.
कोरोना काल में और अभी प्रदेश में फैले बुखार में सरकारी उपेक्षा के चलते उप्र की स्वास्थ्य व्यवस्था की जर्जर हालत सबने देखी।
सस्ते व अच्छे इलाज के लिए घोषणापत्र समिति की सहमति से यूपी कांग्रेस ने निर्णय लिया है कि सरकार बनने पर
'कोई भी हो बीमारी
मुफ्त होगा 10 लाख तक इलाज सरकारी।' pic.twitter.com/wJbTZXbjmk— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2021
కొవిడ్ సంక్షోభం కారణంగా దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు రూ.25వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలు రాజకీయాల్లో ఉండటం తప్పనిసరి అని.. మహిళల మ్యానిఫెస్టో తప్పక తీసుకొస్తామని అన్నారు.