మోడీ రాడర్ వ్యాఖ్యలపై ప్రియాంక సెటైర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : May 13, 2019 / 04:09 PM IST
మోడీ రాడర్ వ్యాఖ్యలపై ప్రియాంక సెటైర్లు

Updated On : May 13, 2019 / 4:09 PM IST

మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌ పై దాడి చేసిందని ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ పెద్ద ఢిఫెన్స్ ఎక్స్ పర్ట్ అని,యుద్ధ విమానాలు ఎవరు తయారుచేయాలో ఆయనే స్వయంగా డిసైడ్ అయ్యారని ప్రియాంక అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019)మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పర్యటించిన ప్రియాంక రాఫెల్ డీల్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ…తమ జీవితంలో ఒక్క విమానం కూడా తయారుచేయనివాళ్లు యుద్ధ విమానాలు తయారుచేస్తారని మోడీ భావించాడన్నారు.మేఘాలు ఉంటే అవి రాడార్ లకు కనిపించవని ప్రియాంక అన్నారు.