Karnataka elections 2023: నందిని Vs అమూల్.. కర్ణాటక ర్యాలీలో ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?

Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల వేళ పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాల విషయంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Karnataka elections 2023: నందిని Vs అమూల్.. కర్ణాటక ర్యాలీలో ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?

Priyanka Gandhi Vadra

Updated On : April 25, 2023 / 4:49 PM IST

Karnataka elections 2023: కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తే నందిని (Nandini) బ్రాండును మరింత శక్తిమంతం చేస్తుందని, ఇతర రాష్ట్రాల నుంచి మరో కోఆపరేటివ్‌ రాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు.

కర్ణాటక పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలలో విలీనం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల వేళ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మైసూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే కర్ణాటకను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని, కర్ణాటక పాల సమాఖ్య (Karnataka Milk Federation-KMF) ను మరింత శక్తిమంతం చేస్తామని తెలిపారు.

కర్ణాటకలో గతంలో ఏ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపర్చిందో ఆలోచించుకుని ఆ ప్రభుత్వాన్నే మళ్లీ ఎన్నుకోవాలని కోరారు. “40 శాతం కమీషన్ తో కర్ణాటకలోని బీజేపీ సర్కారు రూ.1.5 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలు పేదలుగానే ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఇలా ఉంటేనే ప్రజలు తమను ప్రశ్నించబోరని బీజేపీ అనుకుంటోంది.

బీజేపీ ప్రభుత్వం దోచుకున్న డబ్బులో 100 ఎయిమ్స్ (AIMS) నిర్మించవచ్చు. పేద ప్రజలకు 30 లక్షల ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. 750 కిలోమీటర్ల మెట్రో లైను వేయవచ్చు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మద్దతు చెబుతోంది. వారి నుంచి జీఎస్టీ కూడా వసూలు చేయట్లేదు. ప్రజలు వాడే నిత్యావసరాల నుంచి జీఎస్టీ వసూలు చేస్తోంది” అని ప్రియాంక గాంధీ అన్నారు.

Karnataka Polls: లింగాయత్ సీఎం అవినీతిపరుడంటూ రాజకీయ దుమారం లేపిన సిద్ధరామయ్య