దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం : ఈసీ ఆదేశాలు

దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది.

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 03:32 AM IST
దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం : ఈసీ ఆదేశాలు

Updated On : March 20, 2019 / 3:32 AM IST

దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది.

ఢిల్లీ : దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది. దైవారాధనకు ఉపయోగించే స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోకూడదని రాజకీయ పార్టీలు, మత నాయకులను ఈసీ ఆదేశించింది. విభిన్న కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే కార్యకలాపాలు కూడా చేపట్టకూడదని తెలిపింది. 

మసీదుల వద్ద మత ప్రాతిపదికన ఓటర్లను జమ చేయకుండా ఉండటానికి అక్కడ ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేయాలని బీజేపీ ఈసీని కోరిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. శబరిమల దేవాలయం అంశాన్ని తమ ప్రచారంలో వాడుకోవడం కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని మార్చి 11న కేరళలోని రాజకీయ పార్టీలను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారంలో కులం, మతాన్ని ఉపయోగించుకోవడం నిషిద్ధమని ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు.