యుద్ధమేఘాలు : సరిహద్దులకు 10వేల మంది సైన్యం తరలింపు

జమ్మూ కశ్మీర్‌లో కేంద్రం తీసుకుంటోన్న చర్యలను బట్టి భారత్‌కు పాక్‌తో యుద్ధం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. పుల్వామా దాడి జరిగి 8 రోజులు అయినప్పటికీ ఒక్కొక్కరిగా దానికి సంబంధం ఉన్న వాళ్లందరిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 22 శుక్రవారం సాయంత్రం 100 కంపెనీల నుంచి పారా మిలిటరీ సైనికులను జమ్మూ కశ్మీర్‌కు తరలించారు. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తీవ్రంగా మొహరించిన ఆర్మీ బలగాలు శుక్రవారం యాసిన మాలిక్ అనే వ్యక్తిని అరెస్టు చేశాయి.
Read Also: భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్
ముందస్తు జాగ్రత్తగా 10వేల మంది సైనికులను కశ్మీర్‌కు తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఆర్డర్‌లు రావడంతో ఒక్కో కంపెనీ 80 నుంచి 150 మందిని కశ్మీర్‌కు పంపింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఫొటోలు, వీడియోలను బయటపెట్టింది. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో మరింత వేడి రాజుకుంది. అంతకంటే ముందే మిలిటరీ బలగాలు జైషే సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను మట్టుబెట్టాయి. మైసుమా ప్రాంతంలో ఉంటున్న యాసిన్ మాలిక్ అనే కీలక వ్యక్తిని ముందుగా అరెస్టు చేసిన మిలటరీ బలగాలు.. ఆ తర్వాత జైషే ఇస్లామీకు చెందిన వ్యక్తులను, చీఫ్ అబ్దుల్ హమీద్ ఫయాజ్‌ను అర్ధరాత్రి ఆకస్మిక దాడులు జరిపి అరెస్టు చేశారు.
Read Also: గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?
కేంద్రం తీసుకుంటున్న చర్యలపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ’24గంటల్లో కేంద్రం జమ్మూ కశ్మీర్‌లో చేపడుతున్న చర్యలు అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. మత నాయకులను, పలు సంస్థలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేస్తుంది. ఇదెంత వరకూ న్యాయం. వ్యక్తులనైతే అరెస్టు చేయగలరు. కానీ, వాళ్ల ఆలోచనలు కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
In the past 24 hours, Hurriyat leaders & workers of Jamaat organisation have been arrested. Fail to understand such an arbitrary move which will only precipitate matters in J&K. Under what legal grounds are their arrests justified? You can imprison a person but not his ideas.
— Mehbooba Mufti (@MehboobaMufti) February 23, 2019
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు