పుణె కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17మంది దుర్మరణం

పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి బయటకు తరలించారు.

పుణె కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17మంది దుర్మరణం

17 Workers Killed Chemical Factory Fire

Updated On : June 7, 2021 / 8:19 PM IST

17 Workers Killed Chemical Factory Fire : పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 17 మంది మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరో 20 మందిని కాపాడి బయటకు తరలించారు.

ఘటనా సమయంలో 37 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఇప్పటివరకూ 17 మంది మృతదేహాలు వెలికితీయగా.. మరో ఐదుగురు కార్మికులు గల్లంతయినట్టు పోలీసులు వెల్లడించారు.

దట్టమైన పొగ వ్యాపించడంతో వారి ఆచూకీ లభించలేదన్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గాలి, నీరు, కెమికల్ మెటేరియల్స్ తయారీ చేస్తుంటుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.