Pune court: అలాఉంటే నీ భర్తకు నీపై ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది..? వివాహితను ప్రశ్నించిన జడ్జి
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా భార్య కోర్టుకెక్కింది. ఈ కేసు విచారణ సమయంలో వివాహితను ఉద్దేశిస్తూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.

Pune court
Pune: భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా భార్య కోర్టుకెక్కింది. భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో భార్యాభర్తలు పుణె డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని జంటకు సూచించారు. ఇద్దరి వాదనలను జడ్జి విన్నారు. ఈ క్రమంలో వివాహితను ఉద్దేశించి జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన వీడియోను మహిళ తరపు లాయర్ అంకుర్ జహగిర్దార్ లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు. జడ్జి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనాలోచితంగా మాట్లాడారని అన్నారు. ఇంతకీ ఆ జడ్జి ఏమన్నారంటే..
Also Read: EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్‌వో సేవలు.. ఎప్పటినుంచంటే?
మీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిపై బొట్టు కూడా లేదు. మీరు ఒక వివాహితగా ప్రవర్తించకుంటే అటువంటప్పుడు మీ భర్తకు మీపై ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది..? అని వివాహితను పుణె జిల్లాలోని సెషన్స్ జడ్జి ప్రశ్నించారు. ఒక మహిళ బాగా సంపాదిస్తే తనకన్నా ఎక్కువగా సంపాదించే మగాడిని ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తనకన్నా తక్కువ సంపాదించే మగాడితో బతకాలని అస్సలు కోరుకోదు.
Also Read: Telangana Govt: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. ఇక నుంచి 15 నుంచి 65ఏళ్ల మహిళల వరకు ..
మగాడి విషయంలో అలా ఉండదు. బాగా సంపాదించే మగాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను తన ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. చూడండి పురుషులు ఎంత ప్లెక్సిబుల్ గా ఉన్నారు. మీరు కొంత ప్లెక్సిబుల్ గా ఉండాలి. మొండిగా, కఠినంగా ఉండొద్దు అంటూ జడ్జి ఆ వివాహితకు సూచించారు. అయితే, ఆ జడ్జి వ్యాఖ్యలతో కంగుతినడం మహిళ వంతయింది. వివాహిత లాయర్ అంకుర్ జవాగిర్దార్ జడ్జి వ్యాఖ్యలను తప్పుబట్టారు. జడ్జి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు. అయితే, ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉంది.

Ankur Jahagirdar linked in post