మన పోలీసులు కూడా ఇలా ట్రై చెయ్యండి: రాజస్తాన్‌లో ఇంటి నుంచి బయటకొస్తే వినూత్న శిక్ష

దేశంలో కరోనా కేసుల సంఖ్య 900 దాటిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఎంత భయం పుట్టిస్తున్నా కూడా ఇంకా ప్రజలు బయట తీరుగుతూనే కనిపిస్తున్నారు. కాస్త కూడా బాధ్యత లేకుండి ప్రవర్తిస్తున్నారు.
దేశం కోసం.. తొటి ప్రజల కోసం ఓ పాతిక రోజులు బయటకు రాకుండా ఉండలేకపోతున్నారు ప్రజలు. పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా రోడ్ల మీద జనం మాత్రం విపరీతంగా కనిపిస్తున్నారు. లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించేస్తున్నారు. ఎవుడెటుపోతే నాకేంటీ? అనే ధోరిణిలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మనిషికి అకస్మాత్తుగా వచ్చే కష్టాలో, భయాలో జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఇస్తాయి. అయితే అటువంటి సమయాన్ని కూడా ప్రజలు నిజాయితీగా వాడుకోట్లేదు.
మన తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కూడా బయట తిరిగితే అక్కడక్కడ కొట్టడం తప్పితే అర్థం అయ్యేలా చెప్పట్లేదు.. ఇదిలా ఉంటే రాజస్తాన్ అధికారులు మాత్రం ఇంటి నుంచి బయటకు వస్తే వినూత్న శిక్ష విధిస్తున్నారు. రాజస్తాన్‌లోని జున్‌జున్ ప్రాంతంలో ‘ఏ పనీలేకుండా రోడ్లపైకి వచ్చేవారిని అరెస్టు చేయడం, లాఠీలతో కొట్టడం చేయరాదని నిర్ణయించుకున్నారు అధికారులు. అందుకు బదులుగా వారిని జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు సేవలు అందించేందుకు పంపిస్తున్నారు.
ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఎక్కవగా కనిపిస్తుంది. అందుకే లాక్ డౌన్ ఉల్లంఘిస్తే.. అక్కడకు పంపించి సేవ చేయిస్తున్నారు. రోడ్లపై చిల్లరగా తిరిగే వారిని గుర్తించి మాకు ఫొటోలు పంపితే, అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్‌లలో సేవలకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.