కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి

కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి

Updated On : February 23, 2021 / 11:35 AM IST

quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్‌బల్లాపూర్‌లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివమొగ్గ పేలుడు ఘటన మర్చిపోకముందే మరో పేలుడు జరగడం విషాదకరమన్నారు. పేలుడు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.