ఉదయనిధి స్టాలిన్ కి నయనతారతో ఎఫైర్..సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు, తమిళనాడు బీజేపీ నేత రాధారవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉదయనిధి స్టాలిన్ కి నయనతారతో ఎఫైర్..సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

Radha Ravi Makes Controversial Remark Against Nayanthara And Udhayanidhi Stalin

Updated On : March 31, 2021 / 8:40 PM IST

Radha Ravi సీనియర్ నటుడు, తమిళనాడు బీజేపీ నేత రాధారవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ హీరో, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి హీరోయిన్ నయనతారతో ఎఫైర్ ఉందంటూ తాజాగా ఓ రాజకీయ కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల కిందట ఓ ఆడియో లాంచ్‌లో హీరోయిన్ నయనతారపై వ్యాఖ్యలు చేసి డీఎంకే నుంచి సస్పెండైన రాధారవి.. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. కొద్ది నెలల కిందట ఆయన బీజేపీలో చేరారు.

తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు దగ్గర సంబంధాలు ఉన్న విషయంలో తెలిసిందే.. ఈ ఎన్నికల్లో సైతం చాలా మంది సినిమా వాళ్ళు పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే చాలా మంది సినిమా వాళ్ళు పార్టీల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాధారవి తాజాగా ఓ రాజకీయ కార్యక్రమంలో..నయనతారకి డీఎంకేకి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. నయనతారతో ఉదయనిధి స్టాలిన్‌కి ఎఫైర్ ఉందని.. ఆ విషయం మాట్లాడినందుకే తనను డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారని రాధారవి అన్నారు. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని, అయినా అలాంటివి తాను పట్టించుకోనని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఇక, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌పై కూడా రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీకి కమల్‌కి చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ దేశాన్ని కాపాడితే.. కమల్ కట్టుకున్న భార్యలను కూడా కాపాడుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముగ్గురు మహిళ జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆయన విమర్శించారు. రాధారవి కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

రాధారవి చేసిన వ్యాఖ్యలపై డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా రాధారవి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఏప్రిల్-6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ తన తాత కంచుకోట చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.