రాఫెల్‌పై రాహుల్ బయటపెట్టిన సాక్ష్యం : బీజేపీకి ఈ-మెయిల్ చెమటలు

రాఫెల్‌పై రాహుల్ బయటపెట్టిన సాక్ష్యం : బీజేపీకి ఈ-మెయిల్ చెమటలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో సారి పీఎంపై విరుచుకుపడ్డారు. మోడీని ‘చోర్ చౌకీదార్’ అని విమర్శలు చేసిన ఆయన కాగ్(CAG) నివేదికను ‘చౌకీదార్ ఆడిటర్ జనరల్’గా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. కాగ్ ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే నివేదిక ఇస్తుంది. పారదర్శకంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదనే అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం పార్లమెంట్ ముందుకు కాగ్ ఒప్పందం తీసుకువచ్చే సమయానికి ముందు రాహుల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రధానిపై విమర్శలు చేశారు. 

రాఫెల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ కంపెనీకి అంబానీకి మధ్య నరేంద్ర మోడీ మధ్యవర్తిలా వ్యవహరించారని విమర్శించారు. దీనికి తన దగ్గర సాక్ష్యాలున్నాయంటూ ఓ ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్‌ స్కీన్ షాట్‍‌ను ఈ సందర్భంగా మీడియా ముందు బయటపెట్టారు. ఈ ఒప్పందం కుదరడానికి 10 రోజుల ముందే ఫ్రాన్స్ రక్షణశాఖతో ఆ కాంట్రాక్టు కోసం ప్రయత్నించిన అంబానీ భేటీ అయినట్టుగా మెయిల్‌లో స్పష్టమవుతోందన్నారు. 

ముందుగానే రాఫెల్ డీల్ విషయం బయటికి తెలిసే అవకాశాలే లేవని, మోడీనే చెప్పిఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. లేకపోతే రాఫెల్ వ్యవహారాలు లీక్ అయినప్పటికీ రక్షణ శాఖ మౌనంగా ఉండేది కాదని స్పష్టం చేశారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు గుప్పించారు. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ