రాహుల్ గాంధీ రాముడి అవతారం ఎత్తారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాముడి అవతారం ఎత్తారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాముడి అవతారం ఎత్తారు.
పట్నా : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాముడి అవతారం ఎత్తారు. రాహుల్ ఏంటీ..రాముడి అవతారం ఎత్తడమేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం..అయితే మీరే చూడండి.. బీహార్ రాజధాని పట్నాలో రాహుల్ గాంధీ రాముడి అవతారంలో ఉన్నట్లుగా పోస్టర్లు వెలిశాయి. రాహుల్‌ను రాముడితో పోలుస్తూ కార్యకర్తలు తమ భక్తిని చాటుకున్నారు. వాళ్లు కేవలం రామ నామం జపం చేస్తారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి పోస్టర్‌పై రాసారు. రాముడికి నిజమైన భక్తుడు రాహులే అన్నట్లుగా వారు పేర్కొన్నారు. తాజా కాంగ్రెస్ పోస్టర్‌లో సోనియా గాంధీ ఫొటో పక్కన ప్రియాంకా గాంధీ ఫొటో చేరింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతకు ముందు రాహుల్ గాంధీని శివభక్తుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.