Rahul Gandhi: సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మోదీ స్నేహితులు మరింత కుబేరులవుతున్నారు..

దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని గౌతమ్ అదాని పేరు ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మోదీ స్నేహితులు మరింత కుబేరులవుతున్నారు..

Rahual Gandhi

Updated On : August 31, 2022 / 7:08 AM IST

Rahul Gandhi: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంకు చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన్ను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన స్నేహితుల్ని ధనవంతులను చేసేందుకు సామాన్యులను మోదీ దోచుకుంటున్నారని రాహుల్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఓ వైపు సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మోదీ స్నేహితులు కుబేరులుగా మారుతున్నారని అన్నారు.

Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి దూసుకెళ్లిన గౌతమ్ అదానీ.. ఆసియా నుంచి మొదటి వ్యక్తి అతనే

దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితులను మరింత కుబేరులుగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, అందుకోసం పలు విధాలుగా ప్రజలపై భారాలు మోపి దోచుకుంటున్నారంటూ రాహుల్ విమర్శించారు.

ప్రదాని ఇప్పటికైన తన స్నేహితులను కుబేరులుగా మార్చేందుకు చేస్తున్న కృషినిమాని, సామాన్య ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంపై దృష్టిసారించాలని రాహుల్ సూచించారు. అయితే రాహుల్ తన ట్విటర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ జోడించారు. అధికారంలోని భాజపా దేశాన్ని పేదల భారతం, ధనవంతుల భారతంగా మారుస్తోందని అర్థం వచ్చేలా #TwoIndias అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.