Rahul Gandhi: మణిపూర్‌ పర్యటనకు రాహుల్.. హింసాత్మక ఘటనల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Rahul Gandhi: మణిపూర్‌ పర్యటనకు రాహుల్.. హింసాత్మక ఘటనల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ

Rahul Manipur Tour

Updated On : June 28, 2023 / 11:22 AM IST

Manipur: హింసాత్మక ఘటనలతో అతలాకుతలమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur) లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  పర్యటించనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో రాహుల్ మణిపూర్‌లో పర్యటిస్తారని, అక్కడ సహాయ పునరావాస కేంద్రాల్లో అవస్థలు పడుతున్న స్థానికులను పరామర్శిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇంఫాల్, చురచంద్‌పుర్‌లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను రాహుల్ సందర్శించి అక్కడ పౌర సమాజ ప్రతినిధులతో చర్చిస్తారని వేణుగోపాల్ ట్వీట్ ద్వారా తెలిపారు. మణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజం సంఘర్షణ నుండి శాంతివైపు వెళ్లడానికి ఒక స్వస్థత అవసరం. ఇది మానవతా విషాదం, ద్వేషంకాకుండా ప్రేమ యొక్క శక్తిగా ఉండటం మన బాధ్యత అని అన్నారు.

 

 

ఇదిలాఉంటేమణిపూర్‌లో కొంతకాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే3న కొండ జిల్లాల్లో గరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన తరువాత మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుండి దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు మూడువేల మందికిపైగా గాయపడ్డారు. మణిపూర్‌లో అల్లర్లను అణివేసేందుకు ఆర్మీసైతం రంగంలోకి దిగింది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా గత నెలలో నాలుగు రోజులు పాటు మణిపూర్‌రాష్ట్రంలో పర్యటించారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని తిరిగి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాల్లో పలు వర్గాల ప్రతినిధులను అమిత్ షా కలిశారు.

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?

రాష్ట్రంలో ఇటీవల హింసాత్మక ఘటనలపై విచారణకు జూన్ 4న కేంద్రం గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. జూన్ 10న కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో గవర్నర్ నేతృత్వంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ జాతుల మధ్య శాంతిని నెలకొల్పడానికి, వివాదాస్పద గ్రూపుల మధ్య సంభాషణలు ప్రారంభించింది. హోంమంత్రి ఆదేశాల మేరకు మణిపూర్‌లోని నిర్వాసితులకు 101.75 కోట్లు సహాయ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. హింసాత్మక ఘర్షణల కారణంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి వసతి సౌకర్యాలు కల్పించింది.