సుప్రీంకి రాహుల్ బేషరతుగా క్షమాపణ

రఫేల్ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బుధవారం(మే-8,2019)ఆయన మూడు పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు.గౌరవ న్యాయస్ధానానికి తాను అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అఫిడవిట్ లో రాహుల్ తెలిపారు తనపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ ను కొట్టివేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
రఫేల్ ఒప్పందంలో చౌకీదారే దొంగ అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని బీజేపీ నేత మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.