అవసరమైతే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తాం: గెహ్లాట్

రాజస్థాన్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీజేపీ రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సాయంత్రం 5గంటల సమయంలో కలిసి తమకు రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి నుంచి ప్రాణహాని ఉందని మెమొరాండంను అందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు గులాబ్ చంద్ కటారియా లు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
అంతకంటేముందు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం పార్టీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కలిసి అవసరమైతే అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలని అడుగుతామని అన్నారు. జైపూర్ లోని ఫెయిర్మౌంట్ హోటల్ లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఇలా చెప్పారు. ‘అవసరమైతే రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతిని కలుస్తాం. ఇంకా అవసరమైతే ప్రధాని ఇంటి ఎదుటే ధర్నా చేస్తాం’ అని అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. జైపూర్ లోని జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద పోగై నినాదాలు చేశారు. గవర్నర్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా జరిగితే గెహ్లాట్ తన మెజార్టీని నిరూపించుకోగలరని భావిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం ముగిసిన క్యాబినెట్ మీటింగ్ లో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ఆరు పాయింట్లు లేవనెత్తారు. అదే రోజు సాయంత్రం సీఎం నాలుగు బస్సుల్లో రాజ్ భవన్ కు తన పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చారు. అసెంబ్లీ సెషన్ ను సోమవారమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
भाजपा के प्रतिनिधिमंडल ने श्री सतीश पूनियां,श्री गुलाब चंद कटारिया और श्री राजेन्द्र राठौड़ के नेतृत्व में महामहिम राज्यपाल महोदय से मिलकर मुख्यमंत्री के उत्प्रेरण के कारण प्रदेश में व्यापत हो रहे अराजकता के वातावरण पर समुचित कार्यवाही हेतु एवं अन्य गंभीर विषयों पर ज्ञापन सौंपा। pic.twitter.com/21xyVKtcj3
— BJP Rajasthan (@BJP4Rajasthan) July 25, 2020