Rajinikanth Politics : నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమాస్, రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు

రజినీ 2021, జూలై 12వ తేదీ సోమవారం అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. మక్కల్ మండ్రంను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Rajinikanth Politics : నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమాస్, రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు

Rajinikanth Political

Updated On : July 12, 2021 / 1:52 PM IST

Rajinikanth No Politics : రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారా ? వస్తే ఎప్పుడు వస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజినీ ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో అభిమానులతో సమావేశం కావడం దీనికి బలం చేకూరింది. ఈ క్రమంలో…రజినీ 2021, జూలై 12వ తేదీ సోమవారం అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. మక్కల్ మండ్రంను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read More : Bamboo bridge: వరుడి రాకకోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన

మక్కల్ మండ్రం రద్దు : –
భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసమే మక్కల్ మండ్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే..తాను రాజకీయాల్లో లేనప్పుడు దాని అవసరం లేదని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఇది సమయం కాదని చెప్పినట్లు, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా.. రారా అని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు. అందుకే అభిమానుల నుంచి సలహాలు తీసుకోవాలని భావించడం జరిగిందన్నారు.

Read More : Gold Price in India : బంగారం ధరల్లో నో ఛేంజ్!

అమెరికాకు వెళ్లిన రజిని : –
గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన సూపర్ స్టార్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వైద్య ప‌రీక్షల కోసం గత జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. వచ్చి రావడంతోనే అభిమానులతో సమావేశానికి పిలుపునిచ్చారు రజనీ. దీంతో ఆయన రాజకీయాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. రాజకీయాల్లోకి రావడం లేదని రజిని స్పష్టం చేశారు.