మేడిన్ ఇండియా : యుద్ధ విమానం తేజస్‌లో రాజ్ నాథ్ సింగ్ విహారం

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 05:30 AM IST
మేడిన్ ఇండియా : యుద్ధ విమానం తేజస్‌లో రాజ్ నాథ్ సింగ్ విహారం

Updated On : September 19, 2019 / 5:30 AM IST

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు. తేజస్ లో ప్రయాణం నేపథ్యంలో ఆయన జీ సూట్ ధరించారు. ఈ ఫోటోను రాజ్ నాథ్ సింగ్ ట్వీట్టర్ లో షేర్ చేశారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్… పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. తొలుత 40 యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ హెచ్ఏఎల్ కు ఆర్డర్ ఇవ్వగా.. మరో 83 తేజస్ విమానాల కోసం 2018లో మరో ఆర్డర్ ఇచ్చింది.. వీటి విలువ రూ.50వేల కోట్లు ఉంటుంది. 

తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో విహరించిన తొలి రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ ఘనత సాధించారు. 2019 ఫిబ్రవరిలో తేజస్ వాయుసేనలో చేరింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత యుధ్ధ విమానానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదివరకే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తేజస్ లో విహరించారు. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవటంతో పాటు ఎన్నో ప్రత్యేకతలు తేజస్ లో ఉన్నాయి. తేజస్ లో ఎలక్ట్రానిక్ యుధ్ధ సూట్లు, బాంబులు, ఆయుధాలు కూడా ఉంటాయి. ఈ యుధ్ధ విమానానికి మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అప్పట్లో తేజస్ అని నామకరణం చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో తేజస్సు అని అర్థం. తేజస్ యుధ్ధ విమానం రాకతో భారత రక్షణ రంగంలో స్వదేశీ యుధ్ధ విమానాలు ఉపయోగించాలనే చిరకాల స్వప్నం సాకారమైంది. తేజస్ రాకతో భారత రక్షణ రంగంలో కీలకమైన మైలురాయిని  వాయుసేన అధిగమించినట్లయింది. 
 
యుధ్ధ విమానాల నిర్మాణం చేపట్టాలని 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన మిగ్ యుధ్ధ విమానాల స్థానంలో తేజస్ ని తీసుకొచ్చారు. పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన జేఎఫ్-17 యుధ్ధ విమానం కంటే తేజస్ ఎన్నో రెట్లు పవర్ ఫుల్ అని నిపుణులు చెప్పారు.