Thalapathy Vijay : దళపతి విజయ్‌కు మద్దతుగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ర్యాలీ ..

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కు మద్దతుగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ర్యాలీ జరిగింది. ఇటీవల విజయ్ తమిళగ వెట్రి కజగం(టీవీకే) పేరుతో నూతన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.

Thalapathy Vijay : దళపతి విజయ్‌కు మద్దతుగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ర్యాలీ ..

Thalapathy Vijay

Updated On : February 6, 2024 / 8:30 AM IST

Thalapathy Vijay New Party : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కు మద్దతుగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ర్యాలీ జరిగింది. ఇటీవల విజయ్ తమిళగ వెట్రి కజగం(టీవీకే) పేరుతో నూతన పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ పార్టీకి మద్దతుగా జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. విజయ్ టీవీకే రాజకీయ పార్టీని పెట్టడాన్ని వారు స్వాగతించారు. విజయ్ కు రాజకీయ మద్దతును ప్రకటించారు. జాతి సమైక్యత, సమగ్రతకు విజయ్ పాటుపడతారన్న ఆశాభావాన్ని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా అసోసియేషన్ తమిళనాడు శాఖ నాయకులు వ్యక్తం చేశారు.

Also Ra Gadala Srinivasa Rao: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన గడల శ్రీనివాసరావు

విజయ్ నూతన రాజకీయ పార్టీని ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదని విజయ్ చెప్పారు. నా నాయకత్వంలో తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించాం. దానిని నమోదు చేసేందుకు భారత ఎన్నిలక కమిషన్ కు దరఖాస్తు చేశాం. పోటీ చేయడం ద్వారా ప్రజలు కోరుకునే రాజకీయ మార్పుకు మార్గం సుగమం చేయడమే మా లక్ష్యం అని విజయ్ అన్నారు. అయితే, తమిళనాడులో 2026 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తమ పార్టీ టార్గెట్ అని విజయ్ ప్రకటించారు.