Ram Nath Kovind : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు.

Ram Nath Kovind : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు

Ram Nath Kovind

Updated On : November 22, 2023 / 12:31 PM IST

Ram Nath Kovind – Jamili Elections : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల వల్ల కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణతో ఏ రాజకీయ పార్టీ కూడా వివక్షకు గురి కాదని తెలిపారు. ఒకవేళ జమిలి ఎన్నికల విధానం అమలైతే కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. ఈ తరహా ఎన్నికలతో దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒకే దేశం.. ఒకే ఎన్నికకు ఆయన మద్దతు తెలిపారు.

Orange Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరంజ్ అలర్ట్ జారీ

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను ఆయన కోరారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.