82 ఏళ్ల తర్వాత కనిపించిన ఆరెంజ్ స్నేక్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 10:54 AM IST
82 ఏళ్ల తర్వాత కనిపించిన ఆరెంజ్ స్నేక్

Updated On : February 20, 2019 / 10:54 AM IST

ఉత్తరప్రదేశ్ : అరుదైన నారింజ రంగు స్నేక్ యూపీలో ప్రత్యక్షమయ్యింది. 82 సంవత్సరాల తరువాత కనిపించిన ఈ కోరల్ కుక్రి భారతదేశంలోనే అరుదైన పాముగా గుర్తించబడింది. 1936లో దుద్వాలోనే తొలిసారి కనిపించిన ఈ సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు  దుద్వా టైగర్‌ రిజర్వ్‌(డీటీఆర్‌)లో కనిపించింది.సైన్స్‌ పరిభాషలో దీన్ని ‘ఓలిగోడన్‌ ఖేరిన్‌సిస్‌’గా పిలుస్తారు. 114 సెంటీమీటర్ల పొడవు పెరిగే ఈ ఈ పాము ఖేరి ప్రాంతంలో మనుగడ సాగించడంతో దీనికా పేరు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 

నారింజ రంగులో ఉండే ఈ స్నేక్ ను దట్టమైన అడవుల్లో కూడా ఈజీగా గుర్తించవచ్చు. దాని రంగే అదెక్కడుందో కనిపెట్టేలా చేస్తుంది. దక్షిణ సోనారిపూర్‌ రేంజ్‌లో డీటీఆర్‌ సిబ్బంది గుర్తించి.. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ఎమ్‌-స్ట్రిప్‌ యాప్‌ సాయంతో ఈ ఆరెంజ్ స్నేక్ ఫోటో తీశారు.