Rat Hole Mining: ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం పనుల్లో డ్రిల్లింగ్ మిషన్ ఫెయిల్.. కార్మికుల్ని రక్షించేందుకు రంగంలోకి ఎలుక మైనర్ల బృందం

ఉత్తరకాశీ సొరంగంలో ఎలా తవ్వుతారో ఆయనే స్వయంగా వారే చెప్పారు. ఎలుక మైనర్లు మొదట ఇద్దరు వ్యక్తులు పైప్‌లైన్‌లోకి వెళతారు, ఒకరు ముందుకు దారి తీస్తారని, మరొకరు చెత్తను ట్రాలీలో లోడ్ చేస్తారని చెప్పారు

Rat Hole Mining: ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం పనుల్లో డ్రిల్లింగ్ మిషన్ ఫెయిల్.. కార్మికుల్ని రక్షించేందుకు రంగంలోకి ఎలుక మైనర్ల బృందం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మునిగిపోయిన నిర్మాణ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ నేటికి 16వ రోజుకు చేరుకుంది. కార్మికుల్ని బయటికి తీసేందుకు చేపట్టిన 80 సెంటీమీటర్ల వ్యాసం తవ్వకం చివరి 10 మీటర్ల పైపును వేసే పని గత నాలుగు రోజులుగా జరగలేదు. కారణం, ఇప్పటి వరకు 48 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేసిన తర్వాత డ్రిల్లింగ్ ఆగర్ విరిగి ఆ యంత్రం లోపల చిక్కుకుంది.

ప్రత్యామ్నాయంగా ఆర్మీ సిబ్బంది కొండపై నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పటికీ, 30 మీటర్ల వరకు తవ్వకం జరిపినా అక్కడ కూడా నీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. భారీ యంత్రాలు విఫలమవడంతో ఇప్పుడు మిషన్ జిందగీ కింద 41 మంది కూలీలను రక్షించేందుకు ఎలుకల మైనర్ బృందం రంగంలోకి దిగింది.

మైనర్ బృందం ఎలుకల మాదిరిగా చేతితో తవ్వడంలో నిష్ణాతులు
ఈ పేరు వినగానే ఈ ఎలుకల మైనర్లు ఏంటనే ప్రశ్న మీకు వస్తుంది. పేరకు తగ్గట్టుగానే ఎలుకల మాదిరిగా చిన్న స్థలంలో వేగంగా తవ్వే నిపుణుల బృందం అది. వీరిపై ఇప్పుడు 41 సొరంగం కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇంతమంది చేతితో 48 మీటర్లకు మించి తవ్వుతారు. దీని కోసం వారు సుత్తి, కాకి, ఇతర సాంప్రదాయ త్రవ్వకాల సాధనాలను ఉపయోగిస్తారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఈ రకమైన పనిలో అనుభవం ఉన్న 6 ఎలుకల మైనర్ల బృందం అక్కడికి రప్పించారు.

ఇద్దరు తవ్వుతారు
ఉత్తరకాశీ సొరంగంలో ఎలా తవ్వుతారో ఆయనే స్వయంగా వారే చెప్పారు. ఎలుక మైనర్లు మొదట ఇద్దరు వ్యక్తులు పైప్‌లైన్‌లోకి వెళతారు, ఒకరు ముందుకు దారి తీస్తారని, మరొకరు చెత్తను ట్రాలీలో లోడ్ చేస్తారని చెప్పారు. బయట నిలబడి ఉన్న నలుగురు వ్యక్తులు తాడు సహాయంతో పైపు లోపల నుంచి డెబ్రిస్ ట్రాలీని బయటకు తీస్తారు. ఒకేసారి 6 నుంచి 7 కిలోల చెత్తను బయటకు తెస్తుంది. త్రవ్వడానికి లోపలికి వెళ్లిన వాళ్ళు అలిసిపోతే బయటి నుంచి ఇద్దరు లోపలికి వెళ్లి ఇద్దరూ బయటకు వచ్చేస్తారు. అదేవిధంగా మిగిలిన 10 మీటర్ల తవ్వకం పనులు ఒక్కొక్కటిగా జరుగుతాయి. అయితే దీనిపై మైనర్ బృందం మాట్లాడుతూ.. “లోపల చిక్కుకున్న వాళ్ళు కూడా పనివాళ్ళమే, మనం కూడా పనివాళ్లమే, వాళ్ళని కాపాడితే రేపు ఎక్కడో కూరుకుపోతే వాళ్ళు మనల్ని రక్షిస్తారు” అని అన్నారు.