Soaring Lemon Prices : నెలక్రితం బస్తా ధర రూ.600, నేడు రూ.4వేలు.. వామ్మో.. నిమ్మకాయ
సమ్మర్ తో సంబంధం లేకుండానే నిమ్మకాయ పేరు చెబితేనే కొనుగోలుదారులకు చెమట్లు పడుతున్నాయి. ఎందుకిలా?

Soaring Lemon Prices
Soaring Lemon Prices : నిమ్మ రసాన్ని, నిమ్మకాయ పులిహోరను మరికొన్ని రోజులు మర్చిపోవాల్సిందేనా? సమ్మర్ తో సంబంధం లేకుండానే నిమ్మకాయ పేరు చెబితేనే కొనుగోలుదారులకు చెమట్లు పడుతున్నాయి. మొన్నటిదాకా బేరం ఆడితే 20 రూపాయలకు ఐదో ఆరో నిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎండలు దంచేకొద్దీ నిమ్మకాయల ధర చుక్కలను తాకుతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకాయల ధర వేసవితో పోటీపడుతూ భగ్గుమంటోంది. పది రూపాయలకు ఒక్క నిమ్మకాయ ఇస్తే అదే గొప్పగా భావించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం సాధారణ ప్రజలపైనే కాక వ్యాపారులపైనా పడుతోంది. సుమారు 750 నిమ్మకాయలు ఉండే బస్తా ధర ఒకదానికి నెల క్రితం దాదాపుగా రూ.600 నుంచి రూ.650 ఉండేది. అదిప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేలు పలుకుతోంది.(Soaring Lemon Prices)
Andra Pradesh : యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు! ధర వింటే గొంతెండిపోవాల్సిందే..!
వేసవికి తోడు ఈసారి దిగుబడి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగి నిమ్మకాయల ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఉందని అంటున్నారు. బయటి రాష్ట్రాల నుంచి కూడా సరుకు బాగా తగ్గడం కూడా నిమ్మకాయల ధరలు పెరగడానికి కారణం.
Lemon : ఆరోగ్యంతో పాటు అందానికి నిమ్మ
అసలు నిమ్మకాయకు ఎందుకంత డిమాండ్ ఉంది? ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిమ్మకాయల ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిమ్మకాయలు రాకపోవడం వాటి ధరల పెరుగుదలకు ఓ కారణం. అదే సమయంలో నిమ్మకాయలకు డిమాండ్ భారీగా పెరిగింది.(Soaring Lemon Prices)
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే మే నెల తరహాలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. అసలే ఠారెత్తిస్తున్న ఎండలు.. దీనికి తోడు కూరగాయల ధరలూ భగ్గుమంటున్నాయి. ఇది చాలదన్నట్లుగా నిమ్మకాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిమ్మకాయ ధర వింటేనే గొంతెండిపోతోంది. యాపిల్ ధరలతో నిమ్మకాయల ధరలు పోటీ పడుతున్నాయి.
ఈ ఏడాది ఎండాకాలం ముందే వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోయాయి. ఇక ఏప్రిల్ లో చెప్పుకోనక్కర్లేదు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రతతో బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఈ ఎండలకు తోడు నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.
భానుడి ప్రతాపంతో వడదెబ్బకు గురవుతారు, నీరసించిపోతారు. అలా కాకుండా ఉండాలంటే నిమ్మరసంతో కూడిన షర్బత్ తీసుకుంటే సరి. కాసింత రిలీఫ్ లభిస్తుంది. దీంతో అంతా నిమ్మకాయల మీద పడ్డారు. కట్ చేస్తే.. నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.
రికార్డు స్థాయిలో పెరిగిన నిమ్మకాయల ధరలు కొనుగోలుదారులనే కాదు వ్యాపారులనూ ఏడిపిస్తున్నాయి. నిమ్మకాలయ ధరలు చుక్కలను తాకడంతో వాటిని కొనేందుకు చాలామంది సాహసం చేయడం లేదు. దీంతో తమ వ్యాపారం తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ”నిమ్మకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఒక బస్తా నిమ్మకాయలు రూ.600లకు కొనే వాళ్లం. ఇప్పుడు రూ.4వేలు పలుకుతోంది. దీంతో ఒక్కో నిమ్మకాయను రూ.10లకు విక్రయించాల్సి వస్తోంది. కానీ అంత ధర పెట్టి కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు. నిమ్మకాయ కొనకుండానే వెళ్లిపోతున్నారు” అని వ్యాపారులు వాపోతున్నారు.