రెడ్ క్రాస్ మెయిన్ రోల్: అభినందన్ భారత్ పై అడుగు పెట్టేవరకు!

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 03:55 PM IST
రెడ్ క్రాస్ మెయిన్ రోల్: అభినందన్ భారత్ పై అడుగు పెట్టేవరకు!

Updated On : March 1, 2019 / 3:55 PM IST

రెడ్ క్రాస్ సంస్థ గురించి అంతర్జాతీయంగా తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ఛారిటీ కార్యక్రమాలకు పేరుపొందిన రెడ్ క్రాస్ సంస్థ  వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకారం తమ కస్టడీ నుంచి విడుదల చేసిన అభినందన్ ను పాక్ తొలుత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు అప్పగించింది. రెడ్ క్రాస్ నేతృత్వంలోనే అభినందన్ ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకుని రాగా అక్కడి పాకిస్తాన్ అధికారులు నిర్వహించిన ఆఖరి దశ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అంతా రెడ్ క్రాస్ ప్రతినిధుల సమక్షంలోనే జరిగింది. శుక్రవారం ఉదయం పాకిస్తాన్ కస్టడీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వాఘా సరిహద్దు వరకు.. అభినందన్ భారత గడ్డపై అడుగుపెట్టేవరకు రెడ్ క్రాస్ ముఖ్యభూమిక పోషించింది.