Raj Thackeray : మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించండి-ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్ థాకరే

మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Raj Thackeray : మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించండి-ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్ థాకరే

Raj Thackerey

Updated On : April 3, 2022 / 2:08 PM IST

Raj Thackeray : మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గుడి పడ్వా సందర్భంగా నిన్న ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ మసీదులపై ఉన్న మైకులను తొలగించకపోతే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఎక్కువ శబ్దంతో ఎందుకు ప్లే చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. తాను మతోన్మాదిని కానని… భక్తుడను అని అన్నారు. నేను  ఎవరి ప్రార్ధనలు వ్యతిరేకించను . మమల్ని ఇబ్బంది పెట్టకండి… ఉదయం ఐదు గంటలనుంచి మైక్ లో పెద్ద శబ్దంతో  ప్రార్ధనలు చేస్తారు.
Also Read : Pak Election : పాక్‌‌లో త్వరలో ఎన్నికలు ?.. సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్
లౌడ్ స్పీకర్ వాడమని ఏ మతంలో వ్రాయబడింది అని ఆయన అడిగారు. విదేశాల్లో చూడండి ఎక్కడా లౌడ్ స్పీకర్ కనిపించదు. మీరు ప్రార్ధన చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోవాలని రాజ్ థాకరే సూచించారు.

కాగా రాజ్ థాకరే వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఇక్కడ అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని… హోం మంత్రి చట్ట ప్రకారం ప్రతిదీ చేస్తారని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీయమని డిమాండ్ చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నిటిలో మసీదులో అజాన్ ను నిలిపివేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.