Accident :నెత్తురోడిన రోడ్లు, రాజస్థాన్ లో 11 మంది, బెంగళూరులో ఏడుగురు మృతి

బెంగళూరు, రాజస్థాన్ లలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో...18 మంది మృతి చెందారు.

Accident  :నెత్తురోడిన రోడ్లు, రాజస్థాన్ లో 11 మంది, బెంగళూరులో ఏడుగురు మృతి

Accident

Updated On : August 31, 2021 / 10:01 AM IST

Rajasthan And Bangalore : రోడ్లు నెత్తురోడుతున్నాయ. అతివేగంగా ప్రయాణించడం..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ..వారి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా..ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా… డ్రైవింగ్ చేస్తూ..ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా…బెంగళూరు, రాజస్థాన్ లలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

Read More : Mystery Viral Disease : యూపీలో అంతుచిక్కని వ్యాధితో 39 మంది మృతి.. 32 మంది చిన్నారులే!

కోరమంగళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా..ఆసుపత్రికి తరలిస్తుండగా..మరొకరు మృతి చెందారు. అత్యంత వేగంగా ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నారు.

Read More : TVS : అపాచీ 2021 ఆర్ఆర్ 310, న్యూ లుక్..ధర ఎంతో తెలుసా ?

ఇక రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. నాగౌర్ జిల్లాలో ట్రక్కు – తుపాన్ వాహనాలు ఢీకొన్నాయి. 11 మంది చనిపోగా..మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది.