Road Accident : న్యూ ఇయర్ చూడకుండానే నూరేళ్లు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.

Road Accident : న్యూ ఇయర్ చూడకుండానే నూరేళ్లు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Road Accident (2)

Updated On : January 1, 2022 / 7:52 AM IST

Road Accident : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలోని కూలీలు రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ట్రాలీ వారిపై నుంచి వెళ్ళింది. ఘటన పలాజు జిల్లాలోని హరిహర్ గంజ్ వద్ద చోటుచేసుకుంది.

చదవండి : Road Accident : ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఘటనాస్థలానికి సమీపంలోని హరిహరగంజ్ సీహెచ్‌సీకి తరలించారు. బసంతి (17), అర్పణ (14), నీలం (16) పరిస్థితి విషమంగా ఉండటంతో ఔరంగాబాద్ (బీహార్)లోని సదర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు.

చదవండి : Road Accident : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి-అనాధలవటంతో అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే